ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోటేట్‌ గార్డెన్‌.. తక్కువ స్థలంలో కూరగాయల సాగు - ఒంగోలులో రాష్ట్రస్థాయి 47 వ వైఙ్ఞానిక ప్రదర్శన పోటీలు

విద్యార్థుల ఆలోచనాశక్తికి, శాస్త్రీయ దృక్పథం అలవరుచుకునేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న 47వ వైఙ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు అద్భుత ప్రతిభను చాటుతున్నారు.

"విద్యార్థుల మేథస్సుకు నిదర్శనమే ప్రాజెక్టులు"
"విద్యార్థుల మేథస్సుకు నిదర్శనమే ప్రాజెక్టులు"

By

Published : Dec 22, 2019, 10:01 AM IST

Updated : Dec 22, 2019, 6:33 PM IST

ఒంగోలులో 47వ వైఙ్ఞానిక ప్రదర్శన
ప్రకాశం జిల్లా ఒంగోలులో 47 వ వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు రుపొందించారు. విద్యార్థుల మేధస్సుకు నిదర్శనంగా పలు ప్రాజెక్టులు నిలుస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయాధారిత, పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో ప్రదర్శించారు.

సృజనాత్మకతకు నిదర్శనం
13 జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల విద్యార్ధులు తమ మేథస్సు, సృజనాత్మకతకు పదునుపెట్టి... సుమారు 234 ప్రాజెక్టులు ప్రదర్శించారు. సులభమైన, తక్కువ ఖర్చుతో, సమయాన్ని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రైతులు సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అనే విషయంపై పలు నమూనాలు తయారు చేశారు.

ఆకట్టుకున్న ప్రాజెక్టులు
ప్రకాశం జిల్లా వీరేపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు చేసిన విత్తనాల గోడు అనే ప్రాజెక్టు ఆలోచింపజేసింది. సంతనూతలపాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన అగ్రికల్చరల్‌ మల్టీ ట్రేడింగ్‌ మిషన్‌ ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా గుత్తి విద్యార్థులు రూపొందించిన రోటేట్‌ గార్డెన్‌ ద్వారా తక్కువ స్థలాలు ఉన్న అపార్ట్​మెంట్లలో కూరగాయలు పండే విధానాన్ని చూపించారు. పలు రకాలు ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.

పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు
ఈ ప్రదర్శనలు వీక్షించేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తులో విద్యార్థులు హాజరవుతున్నారు.. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలు తమలో శాస్త్రీయ దృక్పథాన్ని ఏర్పరుస్తున్నాయంటున్నారు విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో ఎంపికయిన బృందాలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి

'రాష్ట్రం కోసం త్యాగాలు చేస్తే... ఇదా బహుమతి..?'

Last Updated : Dec 22, 2019, 6:33 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details