ONGOLE BULLS: నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. శ్రీ కృష్ణా యాదవ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన పోటీలు ...ఫ్లడ్ లైట్ల కాంతిలో ఆదివారం ఉదయం వరకు జరిగాయి. ఒంగోలు జాతి ఎడ్లను పరిరక్షిస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఏటా జనవరి ఒకటో తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు హాజరయ్యారు.
ONGOLE BULLS: బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు - ap news
ONGOLE BULLS: నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రవ్యాపంగా వివిధప్రాంతాలనుండి 33 ఎడ్ల జతలు పాల్గొన్నాయి.
![ONGOLE BULLS: బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14072482-590-14072482-1641095350837.jpg)
బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు
బోయినవారిపాలెంలో రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు