ప్రకాశం జిల్లాలోని ప్రతిపాదిత రామయ్యపట్నం పోర్టు స్థలాన్ని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. పోర్టుకు ఉన్న సానుకూల అంశాలు, అవసరమైన స్థలం, నీటి వసతి వంటి వివరాలను కలెక్టర్ పోల భాస్కర్ మంత్రికి వివరించారు. పోర్ట్ నిర్మాణానికి 3500 ఎకరాలు అవసరం కాగా ఇతర పారిశ్రామిక అవసరాలతో కలిపి మొత్తం 5 వేల ఎకరాలు సమకూర్చుకుంటున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
ఆగస్టులో రామయ్యపట్నం పోర్టుకు టెండర్లు - మంత్రి గౌతం రెడ్డి తాజా వార్తలు
రామయ్యపట్నం పోర్టు స్థలాన్ని రాష్ట్ర పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. పోర్టుకు సంబంధించిన వివరాలన్నింటిని కలెక్టర్ పోల భాస్కర్ మంత్రికి వివరించారు. ఆగస్టులో టెండర్లు పిలుస్తామని మంత్రి వెల్లడించారు.
ఆగస్టులో రామయ్యపట్నం పోర్టు టెండర్లు
పోర్టుకు సంబంధించి ఆగస్టులో టెండర్లు పిలుస్తామని అన్నారు. నీటి వసతికి రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి మళ్లిస్తామని... ఈలోగా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ నీటిని వినియోగించుకుంటామని మంత్రి అన్నారు. రామయ్యపట్నం పోర్ట్ ప్రాంతాన్ని ఢిల్లీ, ముంబయి పారిశ్రామిక కారిడార్ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.