ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వివాదాల పరిష్కారం కోసమే రాష్ట్ర వ్యాప్త భూసర్వే' - ప్రకాశం తాజా వార్తలు

దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో.. భూ వివాద పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని.. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

Forest Minister Balineni Srinivasareddy
వివాద పరిష్కారం కోసం భూసర్వే

By

Published : Dec 21, 2020, 6:03 PM IST

దేశంలో ఎక్కడా లేని విధంగా వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూసర్వే కార్యక్రమాన్ని చేపడుతోందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం గుడిమెళ్ళపాడులో వైఎస్ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని మంత్రి ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 పట్టణాలు, 13,371 పంచాయితీల్లో మూడు దశల్లో రీ సర్వే కార్యక్రమం పూర్తి చేస్తామని పేర్కోన్నారు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో ఈ సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకులను నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details