ప్రకాశం జిల్లా చీరాల లోని ప్రభుత్వ వైద్యశాలలో కరోనా నిర్ధరణ పరీక్షల నిమిత్తం 2 యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డిప్యూటీ డీఎంహెచ్ఓ మాధవీలత ప్రారంభించారు.
కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ తిరుపాల్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఐటీసీ ఫ్యాక్టరీ మేనేజర్లు పాల్గొన్నారు. బాధితులను గుర్తించేందుకు పరీక్షలను వేగంగా నిర్వహిస్తున్నామని వైద్యులు చెప్పారు.