దసరా ఉత్సవాలు ప్రకాశం జిల్లా(Prakasam district) చీరాలలో వైభవంగా జరుగుతున్నాయి. వివిధ దేవాలయాల్లో అమ్మవారు వేరువేరు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రులలో భాగంగా చీరాల శ్రీనివాసనగర్‌లోని కిరాణా మార్చంట్స్ అసోషియేషన్ కళ్యాణమండపంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కాళ్యాణం(Srivari Kalyanam) కన్నుల పండుగగా జరిగింది. తిరుపతికి చెందిన శ్రీమాన్ పి.కె.వరదా భట్టాచార్యులు, రుత్విక్ బృందం ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ వ్యాఖ్యాతగా అంధ్రబ్యాంక్ విశ్రాంత ఏజీఎం. ఆర్.వి రమణ వ్యవహరించారు. స్వామి వారి కళ్యాణంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Srivari Kalyanam: చీరాలలో వైభవంగా శ్రీవారి కళ్యాణం - Prakasam district latest news
చీరాలలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీనివాసనగర్‌లోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణం(Srivari Kalyanam) కన్నుల పండుగగా జరిగింది. పెద్ద ఎత్తున్న భక్తులు తరలివచ్చారు.
Srivari Kalyanam