ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరంలో దారుణం జరిగింది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తన భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో వారిని ఆస్పత్రిలో చేర్పించగా..చికిత్స పొందుతూ కుమార్తె ప్రియాంక మృతి చెందింది.
దారుణం: భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త - ప్రకాశం జిల్లాలో దారుణం
మద్యానికి బానిసలై..విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదని..భార్య, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది.
భార్యా, కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన శ్రీనివాసరెడ్డి
Last Updated : Aug 16, 2021, 9:12 AM IST