అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ పరిక్షరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాకు చేరుకుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి తిరుమల దేవస్థానం వరకు ఈ పాదయాత్ర కొనసాగునుంది. ఇవాళ చిననందిపాడు నుంచి పర్చూరు వరకు సాగిన పాదయాత్రలో అడుసుమల్లి గ్రామంలో జేఏసీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజధానిని మార్చే శాసన అధికారం ప్రభుత్వానికి లేదని శ్రీనివాసరావు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయస్థానం తీర్పుపై మంత్రులు, సలహాదారులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు.