ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కిరాణా వోచర్ల పంపిణీ - vetapalem latest news

వేటపాలెంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు కిరాణా సరుకుల వోచర్లను శ్రీ వివేకా ఎడ్యుకేషనల్ డెవలప్​మెంట్​ సొసైటీ ఉచితంగా అందించింది. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా విద్య వ్యవస్ద కుడా చిన్నాభిన్నమయిందని పట్టభద్రుల సంఘము ప్రెసిడెంట్ ప్రత్తి వెంకట సుబ్బారావు అన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

vetapalem
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉచిత కిరాణా వోచర్ల పంపిణీ

By

Published : Jul 27, 2020, 1:31 AM IST

కరోనా సమయంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులుఅనేక ఇబ్బందులు పడుతున్నారని.. వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టభద్రుల సంఘము ప్రెసిడెంట్ ప్రత్తి వెంకట సుబ్బారావు అన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు కిరాణా సరుకుల వోచర్లను ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీ వివేకా ఎడ్యుకేషనల్ డెవలప్​మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇవీ చూడండి-నియామకాల కోసం అభ్యర్థుల ఎదురు చూపులు

ABOUT THE AUTHOR

...view details