ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెన్సీ నోట్ల మధ్య లక్ష్మీదేవిగా కన్యకాపరమేశ్వరీ..ఎక్కడంటే.. - goddess kanyaka parameswari

ప్రకాశం జిల్లాలో కన్యకాపరమేశ్వరీ దేవి ధనలక్ష్మిగా భక్తులను అనుగ్రహించారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా కరెన్సీ నోట్లతో అలంకరించారు.

Breaking News

By

Published : Oct 15, 2021, 4:02 PM IST


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు విజయదశమి సందర్భంగా అమ్మవారు విజయ ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ. 25 లక్షల నగదుతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణలో రూ. 5, 20, 50, 100, 200, 500 కరెన్సీ నోట్లను ఆలయ అధికారులు ఉపయోగించారు. ధనలక్ష్మి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు.

కరెన్సీ నోట్ల మధ్య లక్ష్మీదేవిగా కన్యకాపరమేశ్వరీ

ABOUT THE AUTHOR

...view details