ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడి కోరికతో ప్రారంభం.. నాణ్యమైన స్నాక్స్ కేంద్రంగా ప్రాచుర్యం - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

చేసే పనికి ఏదో స్ఫూర్తి కలగాలంటారు. కుమారుని కోరికే ఆ త్లలిదండ్రులకు స్ఫూర్తినిచ్చింది. ఉన్నత ఉద్యోగాలు ఉన్నా వాటిని వదులుకొని వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి అదే కారణం అయ్యింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఆ దంపతులు పానీపూరి, చాట్ మసాలా వ్యాపారంలో రాణిస్తున్నారు.

Pani Puri Recipe at Ongole
కుమారుడి కోరికతో ప్రారంభం.. నాణ్యమైన స్నాక్ కేంద్రంగా ప్రాచుర్యం

By

Published : Jan 15, 2021, 10:42 PM IST

కుమారుడి కోరికతో ప్రారంభం.. నాణ్యమైన స్నాక్ కేంద్రంగా ప్రాచుర్యం

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన గుమ్మల ప్రశాంత్, రాధాల ఒక్కగానొక్క కుమారుడు. అతనికి పానీపూరి అంటే చాలా ఇష్టం. సాయంత్రం వీధుల్లో విక్రయించే పానీపూరి బండి వద్ద తినిపించేవారు. అయితే లాక్​డౌన్​ సమయంలో ఆ బండ్లు మూతపడ్డాయి. తరువాత కొన్నాళ్ల తర్వత అవి తెరిచినా శుభ్రత లేక తినడానికి భయం వేసేది. పానీపూరి కావాలని కుమారుడు తరుచూ పేచీ పెట్టడం, పరిశుభ్రమైంది లభించకా.. కుమారుడి కోరిక తీర్చలేకపోవడం బాధపడేవారు.

ఉద్యోగాలు వదిలేసి మరీ..

ప్రశాంత్.. ఎం ఫార్మసీ పూర్తి చేసి ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పని చేసేవారు. భార్య రాధ కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. కుమారుడి కోరికను తీర్చాలనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు.. ఉద్యోగాలను వదిలేసి వ్యాపారం వైపు దృష్టి సారించారు. పరిశుభ్రమైన వాతావరణంలో పానీ పూరి చేసి ప్రజలకు అందిస్తే ప్రజలు ఆరోగ్యం కాపాడే అవకాశం వస్తుందని భావించి చాట్, పానీపూరి పాయింట్​ను ఏర్పాటు చేశారు. వంటలో నాణ్యత ప్రమాణాలు పాటించడం, వ్యాపార మెళకువలు కోసం ప్రశాంత్ పూణే వెళ్లి అధ్యయనం చేశారు. ఇప్పడు ఒంగోలు ట్రంక్ రోడ్​లో నాణ్యమైన, పరిశుభ్రమైన స్నాక్స్ కేంద్రంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ప్రస్తుతం పానీపూరితో పాటు చాట్ మసాలా, పిజ్జా, బర్గర్లు, వంటి తయారు చేసి విక్రయిస్తారు. ఇటీవల కాలంలో వినియోగదారుడు ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ కూడా తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు. వీటి తయారీకి బీహార్, గుజరాత్ నుంచి నిపుణులను తీసుకువచ్చారు. నాణ్యమైన, రుచికరమై స్నాక్స్ ఒంగోలు వంటి పట్టణంలో లభించడం ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి దాన్నే ఆదాయమార్గంగా మలుచుకున్న ఆ దంపతులు.. వ్యాపారం చేయాలనుకునే పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ఖరారు

ABOUT THE AUTHOR

...view details