MILK DAIRY: ఒకప్పుడు రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఒంగోలు డెయిరీ.. ప్రస్తుతం మూసివేత దశకు చేరింది. ఒకప్పుడు రోజుకు లక్షల లీటర్ల పాల సేకరణతో.. 3 లక్షల లీటర్ల పాలను పొడిగా మార్చే పరిశ్రమగా వెలిగిన ఈ డెయిరీ.. ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైంది. గత ప్రభుత్వం సాయం చేసినా.. వైకాపా ప్రభుత్వం అమూల్‌కు అప్పజెప్పడంతో.. పరిస్థితి మొదటికొచ్చింది. ఉద్యోగులతో ప్రభుత్వం స్వచ్ఛంద విరమణ చేయించింది. దాదాపు 150 మంది శాశ్వత ఉద్యోగులు.. మరో 200 మంది కాంట్రాక్టు సిబ్బంది ఒక్కసారిగా బయటకెళ్లారు. డెయిరీ శీతలీకరణ కేంద్రాలు సహా.. ఒంగోలు డైయిరీ కార్యాలయం, పాలపొడి ఫ్యాక్టరీ, ప్యాకింగ్ యూనిట్లను..అమూల్‌కు అప్పగించే ప్రయత్నాలు జరిగాయి.
MILK DAIRY: మూసివేత దిశగా ఒంగోలు డెయిరీ.. ఆదుకోవాలంటున్న అన్నదాతలు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
MILK DAIRY: ఆ ఊరికి పరిశ్రమలు తెస్తామన్నారు.. తీరా చూస్తే ఉన్న ఆ ఒక్కడెయిరీ మూసివేశారు. ఉద్యోగులకు ఇష్టం లేకపోయినా.. ఇంటికి సాగనంపారు. ఆ డైరీపైనే ఆధారపడే అన్నదాతలకూ.. మొండిచేయి చూపారు. ఇదీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఒంగోలు డెయిరీ ప్రస్తుత పరిస్థితి. గత ప్రభుత్వం సాయం చేసినా..అమూల్ రాక తర్వాతా డైరీ అవస్థలేంటో ఓసారి చూద్దాం.
అధికారులు ప్రత్యేక కమిటీలు వేసి మరీ.. అమూల్‌కు పాలు పోసేందుకే మొగ్గుచూపారు. రైతులకు మెరుగైన ధర చెల్లిస్తామని చెప్పి మొండిచేయి చూపారని..డైయిరీలో పనిచేసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేసినా ఏదోలా బతికేస్తున్నామని.. ప్రభుత్వం అన్నదాతల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు డెయిరీతో సంబంధం లేకుండా..ఓ ప్రయివేట్ శీతలీకరణ యూనిట్‌తో అమూల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని పాలు సేకరిస్తోంది. దీనిపైనా.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాలు మంచి ఫలితాలు సాధించేలా ఉండాలే తప్ప.. వ్యవస్థను కుప్పకూల్చేలా ఉండరాదని జనం విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి: