ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురిచేడు ఘటనలో ప్రత్యేక బృందం దర్యాప్తు ముమ్మరం

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతిచెందిన ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. బుధవారం గ్రామంలో బాధిత కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలు సేకరించారు. దర్యాప్తులో గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రత్యేక బృందం అధికారి చౌడేశ్వరి తెలిపారు.

special investigation team investigated kurichedu incident in prakasam district
కురిచేడు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన ప్రత్యేక బృందం

By

Published : Aug 5, 2020, 10:38 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటనపై మార్కాపురం ఓఎస్​డీ చౌడేశ్వరి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. బుధవారం గ్రామంలో బాధిత కుటుంబాలను కలిసి వారి వద్ద వివరాలు సేకరించారు. అనంతరం ఔషధ దుకాణాలు, గ్రామంలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించి ఖాళీ శానిటైజర్ బాటిళ్లను సేకరించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబులకు పంపనున్నట్లు తెలిపారు.

ప్రత్యేక బృందం అధికారి చౌడేశ్వరి మాట్లాడుతూ.. శానిటైజర్​ను మందుల దుకాణదారులు ఎక్కడ కొనుగోలు చేశారు, వాటిని ఎక్కడెక్కడ అమ్మారు అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమ బృందంలోని అధికారులు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ తయారుచేసే కంపెనీలను విచారిస్తున్నారని వివరించారు.

మంగళవారం రాత్రి జరిగిన విచారణలో ప్రత్యేక బృందం కురిచేడులో సుమారు 32 దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నట్లు.. మందుల దుకాణాల్లో శానిటైజర్​ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొందరు దుకాణదారులు 5, 10 లీటర్ల క్యానుల్లో శానిటైజర్​ను కొనుగోలు చేసి.. వినియోగదారులకు అమ్మినట్లు గుర్తించారు. వ్యాపారులు చేసిన పాపానికి అమాయకులు బలయ్యారని స్థానికులు అంటున్నారు.

ఇవీ చదవండి...

భార్య అనారోగ్యం కారణంగా మనస్తాపంతో భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details