ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పైషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని సంఘం తాండా అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 1300 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో ఎక్కడైనా బెల్ట్ , నాటు సార తయారీ, అమ్మకాలు, అక్రమ ఇసుక రవణా జరుగుతుంటే తమకు సమాచారం అందించాలన్నారు.
అక్రమ నాటుసారా కేంద్రాలపై దాడులు.. 1300 లీటర్ల బెల్లం ఉట ధ్వంసం - Attacks on Natsara Centers in Tripuranthakam
అక్రమ నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో నిల్వ ఉంచిన 1300 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు.
illegal liquor