ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు - prakasa dist latest news

నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో 60 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ఓబులవారిపల్లెలో 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

seb attack
ఎస్ఈబీ అధికారుల దాడులు

By

Published : Dec 3, 2020, 10:36 PM IST

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం పెద్దపీఆర్సీ తండాలో నాటుసారా విక్రయిస్తున్న ఇద్దరిని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 60 లీటర్ల నాటుసారా, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లా ఓబులవారిపల్లెలో...

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామసమీపంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీదారులు పరారైనట్లు ఎస్ఈబీ ఇన్​స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు. అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

సముద్రంలో మత్స్యకారుల మధ్య వివాదం.. బోట్లతో ఛేజింగ్..!

ABOUT THE AUTHOR

...view details