ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళల భద్రతలో కీలకంగా దిశ చట్టం' - దిశ ద్విచక్ర వాహనాలు ప్రారంభించిన ఎస్పీ సిద్దార్ధ కౌశల్

ప్రకాశం జిల్లాలో దిశా పోలీసు​లకు మంజూరు చేసిన వాహనాలను ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ప్రారంభించారు. మహిళల భద్రతలో.. దిశ చట్టం ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.

SP Siddhartha Kaushal
ఒంగోలులో దిశా, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఎస్పీ సిద్దార్ధ కౌశల్

By

Published : Mar 21, 2021, 9:29 PM IST

ఒంగోలులో దిశా, ద్విచక్ర వాహనాలను ప్రారంభించిన ఎస్పీ సిద్దార్ధ కౌశల్

దిశా పోలీస్​లకు మంజూరు చేసిన వాహనాలను ఒంగోలులోని ఆర్టీసీ బస్​ స్టేషన్​ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ ప్రారంభించారు. జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసిన 50 దిశా.. ద్విచక్ర వాహనాలు, రెండు తుపాను​ వాహనాలు, ఒక ఇన్విస్టిగేషన్ టీం వాహనాన్ని జెండా ఊపి ఆరంభించారు.

మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు, వారికి రక్షణగా నిలిచేందుకు, కళాశాల విద్యార్థినులకు రక్షణగా ఉండటానికి.. ఈ వాహనాలను ఉపయోగిస్తామని చెప్పారు. అనంతరం.. దిశా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఓఎస్​డీ చౌడేశ్వరి, డీఎస్పీ ప్రసాద్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details