ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం - latest news in prakasam district

ప్రకాశం జిల్లాలో కొవిడ్ కారణంగా​ మృతి చెందిన పోలీసుల సేవలు... వెలకట్టలేనివని ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్ అన్నారు. వారి కుటుంబాలకు పోలీసు ​శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

SP Siddharth Kaushal
కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్ధిక సహాయాం

By

Published : Feb 12, 2021, 1:52 PM IST

ప్రకాశం జిల్లాలో కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆర్థిక సహాయాన్ని అందించారు. పోలీసు శాఖ తరుఫున రావలసిన అన్ని రకాల ప్రయోజనాలను త్వరగా వచ్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని.. వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ సిద్ధార్థ్ భరోసా కల్పించారు. ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను మృతుల భార్యలకు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సులోచన పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details