ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ - prakasam district sp siddharth kaushal latest news

ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి, పార పోలీసులకు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ దిశానిర్ధేశం చేశారు. పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను, పార పోలీసులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు.

sp siddharth kaushal
ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

By

Published : Feb 8, 2021, 8:26 AM IST

ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. పలు గ్రామాల్లో పర్యటించి పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి, పార పోలీసులకు దిశానిర్ధేశం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోడానికి పార పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. తొలిసారిగా ఇలాంటి విధులు నిర్వహించడం వల్ల కొంత ఇబ్బంది అనిపించినా... తమ సూచనలు, సలహాలను పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొనాలని ఎస్పీ ఆదేశించారు.

అద్దంకి, మార్టూరు, జె.పంగులూరు మండలాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని తగు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలను, పార పోలీసులకు ఏర్పాటు చేసిన వసతులను ఎస్పీ పరిశీలించారు.

ఇదీ చదవండి: 'మేము అండగా ఉంటాం...ధైర్యంగా ఓటు వేయండి'

ABOUT THE AUTHOR

...view details