ప్రకాశం జిల్లా దర్శి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన మంకెన అమృతరావు అతని కుమారుడు సురేష్ ఇరువురు దర్శిలో మద్యం సేవించి ఇంటికి చేరుకున్నారు. మద్యం మత్తులో వారి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. గొడవ కాస్త పెద్దది అవడంతో సురేష్,.. అమృతరావు తలపై కర్రతో బలంగా పలుమార్లు కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని హుటాహుటిన 108 వాహనంలో దర్శి ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్రథమచికిత్సనందించి పరిస్థితి విషమంగా ఉంటంతో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
MURDER: మద్యం మత్తులో తండ్రిని హత్య చేసిన తనయుడు - CRIME NEWS IN PRAKASAM DISTRICT
తండ్రి కొడుకులిద్దరూ కలసి మద్యం సేవించి దర్శి నుండి ఇంటికి వెళ్లారు. ఇద్దరి మద్య మాటా..మాటా పెరగటంతో కొడుకు కర్రతో తండ్రి ముఖంపై పలుమార్లు కొట్టాడు. తండ్రి స్పృహ కోల్పోవటంతో 108వాహనంలో దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్సానంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందిన ఘటన శనివారం మధ్యాహ్నం తిమ్మాయపాలెంలో చోటు చేసుకుంది.
![MURDER: మద్యం మత్తులో తండ్రిని హత్య చేసిన తనయుడు తండ్రిని కడతేర్చిన తనయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12111579-402-12111579-1623516313455.jpg)
తండ్రిని కడతేర్చిన తనయుడు
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అమృతరావుకి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు. సురేష్ మూడవ కుమారుడు.
ఇవీ చదవండి