ప్రకాశం జిల్లా దొనకొండ మండలం నరసింహనాయునిపల్లె గ్రామంలో ఓ వ్యక్తి.. తన తండ్రిని రోకలిబండతో మోది చంపాడు. పోలీసుల కథనం ప్రకారం... దొనకొండ మండలం నరసింహనాయునిపల్లె గ్రామానికిచెందిన యర్రం చిన పిచ్చిరెడ్డి (60) కి ముగ్గురు కుమారులు. తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమిని ఇటీవల విక్రయించారు. వచ్చిన డబ్బులను పంచాలని బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న మూడో కుమారుడైన వెంగళ రెడ్డి తండ్రితో కొద్ది రోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆగ్రహానికి గురైన వెంగళరెడ్డి పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన పిచ్చిరెడ్డి... అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోష్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
దారుణం: తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు - son murderd his father by a wood spot dead
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కుమారుడు రోకలి బండతో మోది చంపాడు. పొలం తగాదాల్లో వచ్చిన విభేదాల వల్లే ఆగ్రహానికి గురై ఇలా చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు