ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కుమారుడు - బొబ్బేపల్లిలో నేర వార్తలు

మందలించాడని ఓ కుమారుడు తండ్రిని కర్రతో కొట్టిచంపాడు. వ్యసనాలకు అలవాటు పడిన నిందితుడు తండ్రి మందలించాడని.. అతనిపై దాడి చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా బొబ్బేపల్లిలో జరిగింది.

Son killed his father with a stick  in bobbepalli
బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కుమారుడు

By

Published : Jun 13, 2020, 12:25 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో దారుణం జరిగింది. విశ్రాంత ఎక్సైజ్ ఏఎస్సై బత్తుల పరుశురామారావు (71) ను కుమారుడు రమేష్​బాబు కర్రతో కొట్టి చంపాడు. మృతుడు పరుశురామారావుకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. కుమారుల్లో చిన్నవాడైన రమేష్ బాబు (38) బీఫార్మసీ చదువుతూ మద్యలోనే ఆపేశాడు. రమేశ్ బాబుకు వివాహమైన తర్వాత అతని మానసిక పరిస్థితి బాగా లేకపోవటంతో.. భార్య వదిలేసి వెళ్లిపోయింది. అప్పటినుంచి రమేశ్ తండ్రి వద్దే ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. ఈ క్రమంలో తండ్రి పరుశురామారావు కుమారుడిని మందలించాడు. ఆవేశానికి గురైన రమేశ్ పక్కనే ఉన్న కర్రతో.. తండ్రి తలపై బలంగా కొట్టటంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్దలాలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details