తల్లి మందలించటంతో ఉరి వేసుకుని బాలుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగింది. షేక్ ఖాసీం, జాబినా దంపతులకు... హసిమ్, అఖిల్ ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలకు సెలవు కావటంతో పిల్లలు ఇంటివద్దే ఉంటున్నారు. అన్నదమ్ములిద్దరూ ఆడుకునే క్రమంలో గొడవపడటంతో...తల్లి హసిమ్ మందలించింది. దీంతో మనస్థాపం చెందిన హసిమ్(13) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య - ప్రకాశం జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో విషాదం నెలకొంది. తల్లి మందలించిందన్న కారణంతో 13 ఏళ్ల హసిన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
![తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య son committed suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8469352-354-8469352-1597765728954.jpg)
son committed suicide