ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని ఉప్పలగుట్టలో కొంతమంది నాటుసారా విక్రయిస్తున్నట్లు వాలంటీర్ బెల్లంకొండ శ్రీనివాస్‌కు సమాచారమందింది. వాలంటీర్ అక్కడకు వెళ్లి అమ్మవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న ఐదుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని వాలంటీర్ శ్రీనివాస్ తెలిపాడు.
నాటుసారా విక్రయించవద్దని చెప్పినందుకు వాలంటీర్‌పై దాడి - prakasham latest news
నాటుసారా అమ్మవద్దని చెప్పిన వాలంటీర్‌పై దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఉప్పలగుట్టలో చోటు చేసుకుంది.
![నాటుసారా విక్రయించవద్దని చెప్పినందుకు వాలంటీర్‌పై దాడి Some people attacked the volunteer for telling him not to sell natusara in Prakasam district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9029632-14-9029632-1601686829828.jpg)
వాలంటీర్‌పై దాడి