ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్టు అనుమతి ప్రకారమే రైతుల పాదయాత్ర సాగాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ - ప్రకాశం జిల్లా ఎస్పీ

ప్రకాశం జిల్లా చదలవాడ రైతుల యాత్రలో జనం నిబంధనలకు విరుద్ధంగా చొచ్చుకొచ్చారని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్‌ తెలిపారు. వారి అడ్డుకోబోయిన పోలీసులను కర్రలతో దాడి చేశారని తెలిపారుు.

ప్రకాశం జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా ఎస్పీ

By

Published : Nov 11, 2021, 9:46 PM IST

ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద రైతుల యాత్రలోకి నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేక దిశలో జనం చొచ్చుకు వచ్చారని ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్‌ అన్నారు. చొచ్చుకొచ్చిన ప్రజలను అడ్డుకోబోయిన పోలీసులపై కర్రలతో దాడి చేశారని తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిలో తెదేపా రాష్ట్ర నేతలు కూడా ఉన్నారని అన్నారు.

ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతించిన వారే యాత్రలో పాల్గొనాలని ఎస్పీ తెలిపారు. మీడియావాళ్లు యాత్ర మొత్తం కవరేజ్ చేయాలని లేదని అన్నారు. మీడియా ప్రతినిధులు 3 పాయింట్ల నుంచే కవర్‌ చేయాలని చెప్పామని పేర్కొన్నారు. ఐకాస సభ్యులు మీడియాతో మాట్లాడానికి అభ్యంతరం లేదన్నారు. కోర్టు అనుమతి ప్రకారమే రైతుల పాదయాత్ర సాగాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details