ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లేగదూడకు పాలు పట్టిన సామాజిక కార్యకర్తలు! - ప్రకాశం జిల్లా వార్తలు

వారంతా సామాజిక కార్యకర్తలు.. మనషులకే కాదు.. పశువులకు సైతం తమ సేవలు అందిస్తున్నారు. అప్పడే పుట్టిన లేగదూడ ఆకలి తెలుసుకున్నారు. తమ బిడ్డ కడుపు నింపుతున్నట్లుగా ఒళ్లో కూర్చుబెట్టుకుని పాలు పట్టించి ఆకలి తీర్చారు. తల్లి మనసు చాటారు.

Social workers
Social workers

By

Published : May 5, 2021, 5:57 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొందరు సామాజిక కార్యకర్తలు ఆదర్శంగా నిలిచారు. అప్పుడే పుట్టిన లేగ దూడ ఆకలితో ఉందని తెలుసుకుని.. డబ్బా పాలు పట్టించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మార్కాపురం పట్టణంలోని ఓ వీధిలో ఆవు ప్రసవించింది.

విషయాన్ని గమనించిన కొందరు సామాజిక కార్యకర్తలు ఆ దూడను అక్కడి నుంచి ఊరు శివారులో నరసింహస్వామి కొండ వద్ద ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పుడే పుట్టిన దూడ కావడంతో దాని ఆకలి తెలుసుకున్న ఆ మహిళలు... ఒళ్లో కూర్చోబెట్టి డబ్బా పాలు పట్టించారు. తల్లి మనసు చాటుకున్నారని.. ప్రశంసలు అందుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details