ప్రకాశం జిల్లా పోలీసు బలగంలో కీలక పాత్ర పోషించిన స్కూబీ మరణించింది. 2013 నుంచి బాంబ్‌స్క్వాడ్‌లో ఎన్నో సేవలందించింది. పోలీసు బలగంలో కీలక పాత్ర పోషించిన ఈ జాగిలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమీలో స్కూబీ శిక్షణ తీసుకుంది. 2013 నుంచి బాంబ్‌స్క్వాడ్ లో పని చేస్తోంది. విశాఖపట్నంలో ప్రధాని పర్యటన, తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలోనూ ఎనలేని సేవలు అందించింది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు పర్యటన సందర్భంలో స్కూబీ సహకారంతో భద్రతా ఏర్పాట్లు చేసేవారు. స్కూబీ చిన్నప్పటి నుంచి... శిక్షకుడు రామిరెడ్డి పర్యవేక్షణలో పనిచేసింది. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి సైతం తరలించారు. అయినా ఫలితం లేకపోయిది. స్కూబీ నిన్న మృతి చెందగా... అధికారులు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించారు.