ప్రకాశం జిల్లా కురిచేడులోని యూనియాన్ బ్యాంకు వద్ద పాదరక్షలు భౌతిక దూరాన్ని పాటించాయి. బ్యాంకులో పనుల నిమిత్తం వచ్చిన వారు వరుసలో నిలబడలేక వారి చెప్పులను బ్యాంకు వారు ఏర్పరచిన భౌతిక దూరం గుర్తుల్లో ఉంచారు.
ఎండలకు వరుసలో నిలబడలేక వారి పాదరక్షలను అలా పెట్టి.. వారంతా పక్కన నీడలో కూర్చున్నారు. భౌతిక దూరాన్ని మరిచి ముచ్చట్లు పెట్టుకున్నారు. కొందరు మాస్కులు కూడా ధరించకుండా ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. కరోనాను మన చేజేతులా స్వాగతించినట్టే అని.. స్థానికులు అభిప్రాయపడ్డారు.