ప్రకాశం జిల్లా కురిచేడులోని మెడికల్ దుకాణాల్లో.. ప్రత్యేక బృంద అధికారులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. పలు కిరాణా దుకాణాల్లోనూ తనిఖీలు చేశారు. కురిచేడులో ఇటీవల శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను నియమించింది.
అంతే కాకుండా మార్కాపురం ఓఎస్డీ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలతో ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు పలుచోట్ల విచారణ జరిపారు. విచారణలో భాగంగానే అద్దంకి సీఐ ఆధ్వర్యంలో శానిటైజర్ విక్రయించే దాదాపు 32 దుకాణాల్లో తనిఖీలు చేశారు.