మూడో రోజుకి చేరుకున్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు
మూడో రోజుకి చేరుకున్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు - సింగరకొండ ప్రసన్నాంజనేయ తిరునాళ్లు 2020
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 65వ వార్షిక తిరునాళ్లు మూడో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవతో స్వామివారికి పూజలు ప్రారంభించారు. ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు ఇబ్బంది పడకుండా కార్యనిర్వాహకవర్గం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసుల భద్రత నడుమ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
![మూడో రోజుకి చేరుకున్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు singarakonda prasannajaneya thirunallu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6355158-612-6355158-1583785520690.jpg)
మూడో రోజుకి చేరుకున్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు