ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైలేజ్ గడ్డితో పచ్చిగడ్డి కొరతకు పరిష్కారం - వ్యవసాయ వార్తలు

వేసవిలో పచ్చిగడ్డి కోసం పశువులు తల్లడిల్లుతాయి. అయితే వేసవిలోనూ పశువులకు పచ్చిగడ్డిని తయారు చేసే విధానం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో సంగం డెయిరీ సైలేజీ గడ్డి తయారీ కేంద్రం ప్రారంభించింది. ఈ గడ్డికి డిమాండ్ అధికంగానే ఉంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

silage grass production
సైలేజ్‌ గడ్డి తయారు విధానం

By

Published : Jan 7, 2021, 2:45 PM IST

పచ్చిగడ్డే ఆధారమైన పాడిపశువులు వేసవి వచ్చిందంటే ఆ గడ్డికోసం విలవిల్లాడుతాయి. దీనికి తోడు కరవు వచ్చిందంటే వట్టి గడ్డితోనే ఆ రోజును గడిపేస్తాయి. ఆ సమయంలో మేత సమకూర్చాలన్నా వాటి యజమానులకు తలకుమించిన భారమే. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సైలేజ్‌ గడ్డి తయారు విధానం ఈ సమస్యకు పరిస్కారం చూపింది. వేసవిలో కూడా పాడిపశువులకు పచ్చిగడ్డిని అందించడం ద్వారా ఏటికేడు ఆ గడ్డికి డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ప్రైవేటు సంస్థలు సైలేజీ గడ్డి తయారీకి ముందుకొస్తున్నాయి.

సబ్సిడీ లేక నిలిచిన ఉత్పత్తి..

రాష్ట్రంలో పచ్చిగడ్డి కొరతతో పశువులకు మేత లభించకపోవడం.. వాటికి మేత సమకూర్చడంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2015లో అప్పటి ప్రభుత్వం పాతరగడ్డి పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఇంకొల్లు, దర్శిలోని చౌటపాలెం వద్ద రెండు సైలేజీ తయారీ యూనిట్లు వెలిశాయి. ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు కిలో 2 రూపాయలకే అందించారు. గడ్డి ఉపయోగాలను అధికారులు తెలియజెప్పడంతో రైతులు కూడా ముందుకొచ్చారు. అలా 2016లో 10 వేల టన్నులు.. 2017లో 20వేల టన్నులు.. 2018లో 12 వేల టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ఆ తర్వాత సైలేజీ గడ్డికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేకపోవడంతో చాలా చోట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.

సైలేజ్‌ గడ్డి తయారు విధానం

సంగం డెయిరీ తయారీ కేంద్రం..

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో ఇటీవల సంగం డెయిరీ సైలేజీ గడ్డి తయారీ కేంద్రం ప్రారంభించింది. వంద ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసింది. మొక్కజొన్న పంట 90 రోజుల వయసు పాలకంకి దశలో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన యంత్రం ద్వారా మొక్క మొదలు నుంచి చివరి వరకు చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి.. బేలింగ్‌ తయారీ యంత్రాల్లో వేసి 300 కేజీల చొప్పున ముద్దలు చేస్తున్నారు. దీనిని కిలో 6 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. గాలి చొరబడకుండా ఈ ముద్ద చుట్టూ ప్లాస్టిక్‌ కవర్‌తో యంత్రం ద్వారా ప్యాకింగ్‌ చేస్తారు. ఈ విధంగా తయారైన సైలేజ్‌ తొమ్మిది నెలల పాటు చెడిపోకుండా నిల్వ ఉంటుందని తయారీదారు చెబుతున్నారు.

జిల్లాలో పచ్చిగడ్డి పుష్కలంగా ఉందని.. సైలేజీ గడ్డి సబ్సిడీకి ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. డిమాండును బట్టి ప్రభుత్వానికి నివేదిస్తామని.. ఎప్రిల్​లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: యంత్రాల వాడకం పెరిగెను.. సాగు తీరు మారెను

ABOUT THE AUTHOR

...view details