ప్రకాశం జిల్లా ఇంకొల్లులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిమ్మసముద్రం నుంచి గొల్లపాలెం రోడ్లో వెళ్తున్న లారీని అధికారులు తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 183 బియ్యం బస్తాలను సీజ్ చేసి డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంట్లో మొత్తం 8మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. వారందరిపై కేసు నమోదు చేశామని ఇంకొల్లు పోలీసులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 183 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - Rice transport lorry seized in Prakasam district Inkollu
ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 183 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 8 మందిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రేషన్ బియ్యం పట్టివేత
TAGGED:
ప్రకాశం జిల్లా తాజా వార్తలు