ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు అధికార పార్టీ చెంతకు చేరారు. శిద్దాను సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి బాలినేని శ్రీనివాస్ తీసుకువచ్చారు. అనంతరం సీఎం జగన్ సమక్షంలో శిద్దా, ఆయన కుమారుడు సుధీర్ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
వైకాపా గూటికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు - శిద్ధా రాఘవరావు వార్తలు
తెదేపాకు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత శిద్దా రాఘవరావు వైకాపా గూటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
sidda-raghava-rao-joins-ycp-along-with-his-son
ఏడాదిగా జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని శిద్దా రాఘవరావు అన్నారు. వైకాపాలోకి చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేద, మధ్య తరగతి వారికి భవిష్యత్తులోనూ అనేక పథకాలు అమలు చేస్తారని చెప్పారు. సీఎంగా జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని శిద్దా చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి'చేదోడు కాదది.. జగన్మాయ పథకం... అబద్ధమే వైకాపా ఆయుధం'
Last Updated : Jun 10, 2020, 7:25 PM IST