ప్రకాశం జిల్లా కనిగిరి మండలం భూతంవారిపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్ కారణంగా నాగులూరి వెంకటయ్యకు చెందిన పూరిళ్లు ఫూర్తిగా కాలిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేరే ఇళ్లకు మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు చేపట్టారు. సుమారు 30వేల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి రామస్వామి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో పూరిళ్లు దగ్ధం..30వేల ఆస్తి నష్టం - crime news in prakasam dst
విద్యుత్ షాక్ కారణంగా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం భూతంవారిపల్లి గ్రామంలో ఓ పూరిళ్లు కాలిపోయింది. సుమారు 30వేల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి రామస్వామి తెలిపారు.

short circuit in prakasam dst kanigiri mandal