ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు లే అవుట్ల రోడ్లకు ప్రభుత్వ మట్టి - దర్శిలో మట్టి అక్రమ తవ్వకం వార్తలు

ప్రకాశం జిల్లా దర్శిలో లే అవుట్లలో రోడ్ల కోసం కొండమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నారు.

దర్శిలో అక్రమంగా మట్టి తరలింపు

By

Published : Nov 1, 2019, 11:50 AM IST

Updated : Nov 1, 2019, 11:58 AM IST

ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో కొండమట్టిని కొంతమంది అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ప్రభుత్వ అనుమతులు రాకుండానే కొత్తగా లే అవుట్లు వెలిశాయి. వాటిలో రోడ్లు వేయడం కోసం కొండమట్టిని అక్రమంగా తీసుకెళ్తున్నారు. గతంలో రాత్రిపూట తవ్వేవాళ్లు.. అయితే ఈ మధ్య పట్టపగలే మట్టిని రవాణా చేస్తున్నారని స్థానికులు తెలిపారు. రోజూ రెండు పెద్ద ప్రొక్లైనర్లతో మట్టిని తవ్వి లారీలతో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారని చెప్తున్నారు.

దర్శిలో అక్రమంగా మట్టి తరలింపు
Last Updated : Nov 1, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details