బాబుపై జగన్ సోదరి విమర్శలు రాజధాని పేరుతో రైతుల భూములను స్వాధీనం చేసుకుని... అమరావతిలో ఒక్క శాశ్వతం భవనం కూడా కట్టలేకపోయారని తెదేపా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత జగన్ సోదరి వైఎస్ షర్మిళ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలోని గడియార స్తంభం కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. చంద్రబాబుది రోజుకొక మాట, పూటకొక వేషమని ఆమె వ్యాఖ్యానించారు. జగన్.. పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకున్నారని ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఓటర్లను షర్మిల కోరారు.