ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో 'న్యాయ, చట్టాల ద్వారా మహిళా సాధికారత' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ కలిసి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టారు.ఆర్థిక అసమానతలు, సామాజికంగా వ్యత్యాసాల వల్ల గాని న్యాయం దూరం కాకూడదనే న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి.వెంకట జ్యోతిర్మయి అన్నారు.
'మహిళలు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి’ - Seminar on Empowerment of Women
ఒంగోలులో జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో 'న్యాయం, చట్టాల ద్వారా మహిళా సాధికారత అనే అంశం'పై సదస్సు నిర్వహించారు. ఎటువంటి న్యాయపరమైన సమస్యల కోసమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చక్కటి పరిష్కార వేదిక అని వక్తలు సూచించారు.
ఎటువంటి న్యాయపరమైన సమస్యలు కోసమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చక్కటి పరిష్కార వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కెరటాన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని అన్నారు. చిన్నతనం నుంచే స్త్రీ, పురుష సమానత్వం గురించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేర్పించాలన్నారు. న్యాయసేవాధికార సంస్థలు వారి వారి పరిధి మేరకు చట్టపరంగా మహిళలకు అన్ని రకాలుగా సహాయం చేస్తాయన్నారు.
ఇవీ చదవండి: ఒంగోలులో 'జైల్భరో'కు తెదేపా మద్దతు..నేతల అరెస్ట్