ప్రకాశం జిల్లా చీరాలలో.. రాజస్థాన్ కళాకారులు తయారు చేసి తీసుకొచ్చిన మట్టి పాత్రలను అమ్ముతున్నారు. వివిధ కళాకృతుల్లో చేసిన మంచినీటి సీసాలు, చపాతీ, అట్లు చేసే పెనాలు ఉన్నాయి. పాతకాలంలో మట్టిపాత్రల్లో వండుకుని తినేవారు. ఆ పాత్రల్లో వండిన వంటకాల్లో పోషక విలువలు ఉంటాయని.. ప్రజలు మళ్లీ వాటి వాడకం మొదలుపెడుతున్నారు. ఇప్పటి తరం వారు వాడే వంట సామగ్రికి తగ్గట్టు పలు ఆకృతుల్లో వస్తువులు అందుబాటులో ఉంచారు. పట్టణ ప్రజలు ఆసక్తి చూపిస్తూ కొనుగోలు చేస్తున్నారు.
చీరాలలో మట్టి పాత్రల అమ్మకాలు.. ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు - selling of mud containers in chirala news
ఎండాకాలం వస్తుందంటే.. చల్లని నీటి కోసం మట్టి పాత్రలు గుర్తొస్తాయి. అమ్మమ్మలు, నాయనమ్మల తరంలోనూ.. కాలంతో సంబంధం లేకుండా వంట సామగ్రి అంతా మట్టి పాత్రలే ఉపయోగించేవారు. రాగి, అల్యూమినియం, స్టీల్ పాత్రల వాడకం ప్రస్తుతం ఎక్కువైంది. కానీ.. మారుతున్న జీవన శైలితో పాటు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. మళ్లీ మట్టి పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు.
![చీరాలలో మట్టి పాత్రల అమ్మకాలు.. ఆసక్తి చూపుతున్న కొనుగోలుదారులు selling of mud containers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10989817-175-10989817-1615622205322.jpg)
మట్టి పాత్రల అమ్మకాలు