ప్రకాశం జిల్లా పెదఉల్లగల్లు చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 610 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పెద ఉల్లగల్లు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై వెంకట సైదులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 610 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - ప్రకాశంజిల్లా
పెదఉల్లగల్లు చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 610 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
లారీ
రాష్ట్రంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట రేషన్ బియ్యం పట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పోలీసుల తనిఖీల్లో పట్టుకున్న చౌక బియ్యం లారీలు ఎక్కడకు వెళుతున్నాయో, వారిపై పెట్టిన కేసులు ఏమవుతున్నాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి:PDS RICE: 65 టన్నుల రేషన్ బియ్యం సీజ్