ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం పోలీసులు సోదాలు చేశారు. ఇళ్లలో నిర్వహిస్తున్న దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో ఓ ఇంట్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 20వేల రూపాయలు విలువ ఉంటుందని ఎస్సై రామకోటయ్య తెలిపారు. నిషేధిత గుట్కాలు అమ్ముతున్నట్లుగా అనుమానం ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దర్శిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - Seized prohibited gutka packets in Darshi
ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిషేధిత గుట్కా పొట్లాలను పట్టుకున్నారు.
![దర్శిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం Seized prohibited gutka packets in Darshi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9180021-753-9180021-1602740423304.jpg)
దర్శిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం