లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలోనూ... ఓ వైకాపా నేత భారీగా మద్యం నిల్వలతో పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు నిర్వహించగా... అక్కడి వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో భారీగా మద్యం లభ్యమైంది. 1200 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న అధికారులు ఓ కారు, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల భారీగా మద్యం నిల్వలున్నాయన్న సమాచారంతో.... ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. గడికోట ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం - వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటకు చెందిన వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం లభ్యమైంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని... కారును, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం