Secretariat Staff OTS Fraud: ఓటిఎస్ పేరుతో సచివాలయ అధికారులు భారీ మోసాలకు తెగబడుతున్న వైనం ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలంలో చోటు చేసుకుంది. జగనన్న సంపూర్ణ గృహకు పథకాన్ని ఎరగా వేస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. మండలంలోని లక్ష్మక్క పల్లి, లింగన్నపాలెం, అడవిలోపల్లి గ్రామాలలో సుమారు 121 మంది లబ్ధిదారులను ఓటిఎస్కు అర్హులుగా ఎంపిక చేసి వారిని ఓటిఎస్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. వీరిలో 49 మంది వరకు బ్యాంకులో రుణాలు తీసుకోగా.. ఎటువంటి లోన్ లేకుండా 72 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయినప్పటికీ 49 మంది మాత్రం ఒక్కొక్కరు 5,400 నుంచి 10 వెల రూపాయల వరకు చెల్లిస్తే తమకు జగనన్న ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా శాశ్వత హక్కు చట్టాన్ని కల్పిస్తామని.. మిగిలిన 72 మంది 10 వేలు చెల్లిస్తే చాలు అన్నారు.
Village Secretariat OTS Fraud: పది వేలు చెల్లించి ఇంటి పట్టా పొందండి.. ఓటీఎస్ పేరుతో సచివాలయ ఉద్యోగి మోసం - ఓటీఎస్ మోసం
Secretariat Staff OTS Fraud: ఓటీఎస్ పేరుతో.. ఓ సచివాలయ అధికారి భారీ మోసానికి తెరలేపాడు. జగనన్న ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా శాశ్వత హక్కు చట్టాన్ని కల్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద పదివేల రూపాయలను తీసుకుని మోసం చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్ద చెర్లోపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అధికారుల మాటలు విన్న ఆయా గ్రామస్థులు అవి ఏమీ పట్టనట్లుగా ఉండిపోయారు. దీంతోపాటు మరోమారు ఓటు వేసి తప్పకుండా చేయించుకోవాలని లేకుంటే ప్రభుత్వ పథకాలు ఆపివేస్తామని ఒత్తిడి చేశారని స్థానికులు ఆరోపించారు. దీంతో భయభ్రాంతులకు గురైన గ్రామీణ ప్రాంత వాసులు 5 వేల నుంచి 10 వేల రూపాయల వరకు ఆయా సచివాలయ అధికారులకు చెల్లించినట్లు తెలిపారు. అంతేకాక ఓటిఎస్కు అర్హత లేని వారి వద్ద నుంచి కూడా అధిక మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చెల్లించిన నగదు పోగా.. ఇప్పటి వరకు ఓటిఎస్కు సంబంధించిన ఎలాంటి రసీదు కూడా ఇవ్వలేదని.. ఆందోళన చెందుతున్నారు. ఈ తతంగం మొత్తం లక్ష్మక్క పల్లి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోలప్పల నాయుడు జరిపాడని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నగదును చెల్లించి ఏడాది అవుతున్నా తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని అధికారిని నిలదీయగా.. తమకు నఖిలీ పట్టాలను అంటగట్టారని బాధితులు వాపోయారు. ఇంత ఘరానా మోసం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
"ఇంటి పట్టా కోసం సచివాలయంలో పోలప్పల నాయుడుకు పదివేలు రూపాయలు చెల్లించాను. పట్టా ఇస్తానంటూ ఏడాది పాటు మోసం చేసి తిప్పించుకున్నాడు. మేము గట్టిగా నిలదీస్తే.. మొన్న ఐదు రోజుల క్రితం పట్టా తీసుకుని వచ్చి ఇచ్చాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో పెట్టుకో అని చెప్పాడు. దీంతో నాకు అనుమానం వచ్చి.. ఇంకొక పట్టా చేయించుకున్నాను. ఇది డూప్లికేట్ అని నాకు అప్పుడు తెలిసింది. నేను పదివేలు కట్టినా.. అందులో మాత్రం చెల్లించినట్లు లేదు." - మాల కొండయ్య, బాధితుడు