ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో రెండో విడత అమ్మఒడి చెక్కుల పంపిణీ.. - ఎమ్మెల్యే అన్నా రాంబాబు

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత అమ్మఒడి చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

econd term ammavodi payments stratred in prakasam
ప్రకాశం జిల్లాలో రెండో విడత అమ్మఒడి చెక్కుల పంపిణీ

By

Published : Jan 11, 2021, 5:33 PM IST

గిద్దలూరులో...

ప్రకాశం జిల్లా గిద్దలూరులో పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు అమ్మ ఒడి చెక్కుల పంపిణీ చేశారు. ముందుగా పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీతో ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం లక్ష్యం

పేదపిల్లలకు నాణ్యమైన విద్య, పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలికవసతులు అందిస్తున్నారన్నారు. పిల్లలు మంచి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థితికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్​ఛార్జ్​ కమిషనర్ యేసయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అమ్మఒడి రెండో విడత చెల్లింపులు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details