ప్రకాశం జిల్లా గార్లపేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలు పట్టుబడ్డాయి. పొదిలి పరిధిలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి తరలించి.. ఈ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. 329 మద్యం సీసాలతో పాటు మరికొన్ని బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మద్యం నిల్వ ఉంచిన వ్యక్తితో పాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే మరో ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణ ఉద్యోగుల అరెస్ట్ - Seized liquor bottles stored at home in Garlapeta
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేటలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 329 మద్యం సీసాలతో పాటు.. నలుగురిని అరెస్ట్ చేశారు.
![ప్రభుత్వ మద్యం దుకాణ ఉద్యోగుల అరెస్ట్ illegal liquor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11420449-515-11420449-1618541845213.jpg)
అక్రమ మద్యం