ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ దాడులు - pillala cheruvu latest news

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశారు.

seb raids
ఎస్​ఈబీ దాడులు

By

Published : May 29, 2021, 7:04 AM IST

ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని నాటుసారా స్థావరాలపై దాడులు చేసినట్లు ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. నారాజముల తండా అటవీ ప్రాంతంలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సూమారు 1000 లీటర్ల బెల్లం ఊటను, సామగ్రిని ధ్వంసం చేశామని వెల్లడించారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో ఎక్కడైనా నాటుసారా తయారీ, అమ్మకాలు, ఇసుక అక్రమ రవాణాపై తమకు సమాచారం అందించాలని ప్రజలకు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details