ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జవహర్ లాల్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో 13 జిల్లాల నుంచి 234 పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 50 ప్రాజెక్టులను న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసి...విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందించారు. ఇందులో ఎంపికైన వారు.. సదరన్ స్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు అర్హత సాధించారు.
ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు - జవహర్ లాల్ నెహ్రూ బాలబాలికల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం
ఒంగోలులో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు ఘనంగా ముగిశాయి. ఈ ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా... పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రాజెక్టులను ఎంపిక చేసి వాటి గుర్తింపు పత్రాలను విద్యార్థులకు నిర్వహకులు అందించారు.

ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు
ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు