ప్రకాశం జిల్లాలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. చీరాల, పర్చూరు నియోజకవర్గాలలో 9,10, ఇంటర్ విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి తరగతి గదుల్లోకి అనుమతించారు. తరగతి గదుల్లో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈపురుపాలెంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి తరగతి గదుల్లోకి అనుమతించారు.
ప్రకాశం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు - ప్రకాశం జిల్లాలో తిరిగి ప్రారంభమైన విద్యాసంస్థలు
కరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు నియోజకవర్గాలలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి అనుమతించారు.
విద్యార్థులకు థర్మల్ స్కీనింగ్ పరీక్షలు