ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మళ్లీ  తెరపైకి రామచంద్రాపురం వివాదం - school students protest at ongole collectorate

ప్రకాశం జిల్లా రామచంద్రాపురంలో.. ఇటీవల ఓ చిన్నారి సామాజిక బహిష్కరణపై.. ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఇప్పుడు అదే చిన్నారి.. సమస్య పరిష్కారం కావడం లేదంటూ మరో ఇద్దరితో కలిసి ఆందోళనబాటపట్టింది.

school students protest at ongole collectorate

By

Published : Sep 30, 2019, 10:54 PM IST

Updated : Oct 1, 2019, 1:39 PM IST

మళ్లీ తెరపైకి రామచంద్రాపురం వివాదం

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు ఎవరూ తమతో మాట్లాడటం లేదని కన్నీరు పెట్టుకున్నారు. బడిలో ఆయా సైతం తమకు మధ్యాహ్న భోజనం వడ్డించడం లేదంటూ ముగ్గురు చిన్నారులు వారి బాధను వ్యక్తం చేశారు. తమతో మాట్లాడినా, ఆడుకున్నా పది వేల రూపాయల జరిమానా విధిస్తూ గ్రామ పెద్దలు తీర్మానించారని వాపోయారు. ఇదేం న్యాయం అంటూ విద్యార్థులు కోడూరి పుష్ప, గాయత్రి, హేమంత్​ ప్రశ్నించారు. 'ఆధునిక రాజ్యంలో మానవీయ ఆంక్షలా?' అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ పిల్లలు వారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ లేఖ రాసింది నేనే..

తాము గ్రామంలో ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రికి గతంలో లేఖ రాయడం వాస్తవమని చిన్నారి పుష్ప తెలిపింది. అలా చేసినా... గ్రామ పరిస్థితుల్లో మార్పు లేదని కన్నీరు పెట్టుకుంది. ప్రభుత్వ అధికారులు కల్పించుకొని ఊరి పరిస్థితులు చక్కదిద్దాలని కోరారు. రాజకీయ విద్వేషాలతో తమ బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయొద్దంటూ విద్యార్థి తండ్రి రాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి :

జగనన్నా భయంగా ఉంది... నాన్న, తాతను చంపేస్తారట !

Last Updated : Oct 1, 2019, 1:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details