ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలోని శ్రీ పుచ్చకాయల సుబ్బారాయుడు హనుమాయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామంలోని పేద బలహీన వర్గాల పిల్లలకు స్కాలర్ షిప్ రూపంలో రూ.22 వేలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పుచ్చకాయల వెంకట్రావు మరియు వారి సోదరి పెద్ది సరస్వతి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో పేద విద్యార్థులకు ఈ విధంగా సహాయం చేస్తుంటారు. అదే విధంగా గ్రామంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి కుటుంబానికి 5 వేల రూపాయలు అందజేస్తుంటారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి 5 రూపాయలకే 20 లీటర్ల నీటిని గ్రామంలోని ప్రజలకు అందజేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే నగదుతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ - prakasham district
శ్రీ పుచ్చకాయల సుబ్బారాయుడు హనుమాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
school bags distrubution held by srib puchhakayala subbarayidu hanumayamma trust at prakasham district