ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో శాటిలైట్ బెడ్స్ విధానం అమలు: కలెక్టర్ - ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్​ ఆసుపత్రి పరిస్థితులను.. జిల్లా పాలనాధికారి పోలా భాస్కర్ పరిశీలించారు. సీనియర్‌ వైద్యులు కొందరు విధులకు గైర్హాజరవుతున్నట్లు.. తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తుండటంతో.. పడకలకు ఇబ్బందులు తలెత్తుతుందని తెలిపారు. దీంతో శాటిలైట్ బెడ్స్ విధానం అమలు చేస్తున్నామన్నారు.

rims
ప్రకాశం కలెక్టర్ పోలా భాస్కర్

By

Published : Apr 26, 2021, 6:38 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్​ ఆసుపత్రి పరిస్థితులను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. సీనియర్‌ వైద్యులు కొందరు విధులకు గైర్హజరవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, క్లిష్టపరిస్థితుల్లో ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆసుపత్రిలో రోగుల అవసరాలు తీర్చడానికి, వారి ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకురావడానికి సరైన వ్వవస్థ లేదని పేర్కొన్నారు. అందువల్ల జాయింట్‌ కలెక్టర్‌-3 కృష్ణవేణిని.. ఈ ఆసుపత్రికి ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు. ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని, దీంతో పడకలకు సమస్య ఏర్పడుతుండటంతో, శాటిలైట్‌ బెడ్స్ విధానం అమలు చేస్తున్నామన్నారు.


ఇదీ చదవండి:కొవిడ్ కేర్ సెంటర్​లో ప్రత్యేకాధికారి కృష్ణబాబు ఆకస్మిక తనిఖీ

ABOUT THE AUTHOR

...view details