ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు పాదయాత్ర ఆపించండి'..ప్రకాశం ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి - ప్రకాశం ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి వార్తలు

ప్రకాశం ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి
ప్రకాశం ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి

By

Published : Nov 7, 2021, 12:35 PM IST

Updated : Nov 7, 2021, 1:17 PM IST

12:32 November 07

ఎస్పీని కలిసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలని వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రకాశం ఎస్పీని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పాదయాత్రకు అనుమతించొద్దని కోరారు. పాదయాత్రను నిలుపుదల చేయలేకపోతే రూట్ మార్చాలన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ అంశంపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని సుధాకర్‌ బాబు స్పష్టం చేశారు.  

ప్రభంజనంలా మాహా పాదయాత్ర

అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ.. రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. అమరావతి రణన్నినాదం.. నలుదిక్కులా మార్మోగుతోంది. శనివారం 14 కి.మీ. మేర సాగిన పాదయాత్ర.. ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ ఏడో రోజు మహాపాదయాత్ర ఉదయం 8 గంటలకు పర్చూరు నుంచి ప్రారంభమైంది. సుమారు 17 కిలోమీటర్ల మేర సాగనున్న పాదయాత్ర.. సాయంత్రం ఇంకొల్లులో ముగుస్తుంది.

మధ్యాహ్న పర్చూరు మండలం వంకాయలపాడులో రైతులు భోజనం చేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వంకాయలపాడు నుంచి మొదలై.. ఇంకొల్లుకు చేరుకుంటుంది. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. కాగా.. కార్తీక సోమవారం సందర్భంగా రేపు పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి రైతుల మహాపాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది.

పోలీసుల అభ్యంతరాలు

ఇదిలా ఉంటే.. అమరావతి రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్ర సాగుతున్న తీరుపై పోలీసులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ..పాదయాత్ర నిర్వాహకులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు వెయ్యిమంది పోలీసులు మోహరించారు.

పర్చూరులోని రైతుల శిబిరం వద్దకు వెళ్లిన డీఎస్పీ శ్రీకాంత్.. పరిస్థిని సమీక్షించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని..,శబ్దాలు ఎక్కువగా చేస్తున్నారన్నారు. అయితే.. హైకోర్టు ఆదేశాల మేరకే పాదయాత్ర సాగుతోందని ఐకాస నాయకులు తెలిపారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించడం లేదన్నారు. ఎవరైనా వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపితే..,తమకు సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాలో యాత్ర ఇలా..

అమరావతి రైతులు తలపెట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థాననం' మహాపాదయాత్ర..జిల్లాలో 12 రోజులపాటు సాగనుంది. మరో రెండు రోజులు విశ్రాంతి కోసం మార్గ మధ్యలో రైతులు ఆగనున్నారు. జిల్లాలో పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కందుకూరు, గుడ్లూరు తదితర మండలాల మీదుగా పాదయాత్ర సాగునున్నట్లు రైతు ఐకాస నేతలు స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి

amaravati padayatra : పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

Last Updated : Nov 7, 2021, 1:17 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details